Sunday, March 13, 2011

తెలుగు బ్లాగులు

తెలుగు బ్లాగులు ఇన్నాళ్ళుగా చదివిన తర్వాత అర్ధమైనదేంటంటే, ఒకవేళ మన తెలుగు బ్లాగులు సుమారుగా మన తెలుగు జాతి ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నట్లయితే, మనవాళ్ళ గురించి అప్పారావు/గిరీశం గారు ఓ నూట పాతిక సంవత్సరాల ముందే చక్కగా వర్ణించారు. అప్పటికి ఇప్పటికి ఏం మార్పులేదు.

తెలుగు బ్లాగులేం ఖర్మ, తెలుగు టి.వి. కార్యక్రమాలు చూసినా చాలు, మన జాతి ఎలా వెలిగిపోతోందో అర్ధమైపోతుంటుంది. ఇంట్లో తెలుగు టి.వి. కార్యక్రమాలు నిషేధించడమైపోయింది.

ఈ తెలుగు బ్లాగు విశ్వంలో సమయం వెచ్చించడం వృధా అనిపిస్తోంది, అయినా దురలవాట్లు అంత తొందరగా పోవుగా ;)