Sunday, April 15, 2012

రాజకీయనాయకులతో జోకులా ...

తెలుగు రాజకీయ బ్లాగులు అంత చురుకుగా పనిచెయ్యడంలేదేమో కదా ;) ఎన్నికల సమయంకోసం శక్తి యుక్తుల్ని ఆదా చేస్తున్నారేమో :)

సడెన్‌గా మమతా దీదీ మీద కార్టూన్ల ప్రహసనంతో పాత జోకొకటి గుర్తుకొస్తోంది:

ఎప్పుడో పాతకాలంలో ఒకసారి అమెరికన్ ప్రెసిడెంటు, రష్యన్ ప్రెసిడెంటు మాట్లాడుకుంటున్నారుట, యధాలాపంగా అమెరికన్ ప్రెసిడెంటు అన్నాడుట, నామీద జోకుల్ని సేకరించడం నా హాబీ అని అయితే రష్యన్ ప్రెసిడెంటు నామీద జోకుల్ని వేసేవాళ్లని సేకరించడం నా హాబీ అని అన్నాడట :)

అదీ సంగతి, అనవసరంగా వాళ్ల సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి తెలియకుండా జోకులేస్తే ...

దీదీని ప్రక్కన పెడితే మనవాళ్లు ఓ మాదిరిగా పర్వాలేదనిపిస్తుంది లేకపోతే ఈ పాటికి మన రాజకీయ బ్లాగర్లు బ్లాగులు మూసేసుకోవలసి వచ్చేదేమోకదా?



~సూర్యుడు :-)