మొత్తానికి ఇన్నాళ్ళ ఉత్కంఠకి తెరదించుతు, కాంగ్రెస్ అధిష్టానము తెలంగాణ వేరే రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యటానికి నిర్ణయం తీసుకుంది. ఇది ఎవరికి ఉపయోగకరమైనా కాకపోయినా ఒక అనివార్యత. అన్ని రకాల మార్పుల్లోలాగానే ఇప్పుడుకూడా ఈ విభజన నచ్చనివాళ్ళు ఈ మార్పుని ఒప్పుకోలేకపోతున్నారు, దీనికి కొంత సమయం తీసుకుంటుంది (డినయల్, ఏంగర్, యాంగ్జైటీ స్టేజస్ని దాటడానికి). ఇప్పుడు ఇంకా సమైక్యాంధ్ర అంటూ గొడవలు చెయ్యడం కన్నా, కొత్త రాష్ట్రాన్ని ఎలా నిర్మించుకోవాలి, దాన్ని ఎలా త్వరగ అభివృద్ధి చేసుకోవాలని ఆలోచించడం మంచిదేమో.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇన్నాళ్లైనా హైద్రాబాద్ ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతాలేమీ అభివృద్ధి చెందలేదు, ఇప్పటికైనా మేలుకుని, ఒక్క రాజధానినే అభివృద్ధి పరచడం మాని అన్ని ప్రాంతాలనీ సమానంగ అభివృద్ధిలోకి తీసుకువస్తే ముందు ముందు, ఇలాంటి విభేధాలు తలెత్తకుండా ఉంటాయి.
కొత్త ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ప్రదేశాల్లో ఎటువంటి వనరులున్నాయో, వాటికి ఉపయోగపడే పరిశ్రమలను ఏర్పరచి, వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, ఆధునిక సాంకేతిక రంగాల్లో పరిశ్రమలు నెలకొల్పటానికి ప్రోత్సాహాన్నిచ్చి సర్వతోముఖ అభివృద్ధికి ప్రణాళికకలు చెయ్యబోతారని ఆశిస్తు ...
~సూర్యుడు :-)