గత మూడు సంవత్సరాలుగా ఈ తెలుగు బ్లాగుల్లో గమనించిందేమంటే, ఇక్కడ రాజకీయాలంటే చాలామందికి ఇష్టం, అంతేకాకుండా, రాజకీయాలంటే ఎంత ఇష్టమో, కాంగ్రెస్ అంటే అంత అయిష్టం. ఇంక వీరి అభిప్రాయాలెలా ఉంటాయంటే:
కాంగ్రెస్ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకొస్తే కుటుంబరాజకీయాలు -
మన పార్టీ నాయకుల పిల్లలొస్తే వంశగర్జనలు
అదే నాయకుడు కాంగ్రెస్‌లో ఉన్నంతవరకు అవినీతిపరుడు, పనికిరానివాడు
మనపార్టీలోకి రాగానే గొప్పరాజకీయనాయకుడు
కాంగ్రెస్‌పార్టీ నాయకులుచేసే అవినీతి స్కాం
మనపార్టీ నాయకులు చేస్తే (ఛ, ఊరుకోండి, మనపార్టీ నాయకులెక్కడైనా అవినీతికి పాల్పడతారా, నిప్పు కదూ ;))
కాంగ్రెస్ నాయకులు వాళ్ల పార్టీ విధానాలకి కట్టుబడుంటే, అకశేరుకాలు
మనపార్టీ నాయకులు మన పార్టీ విధానలకి కట్టుబడుంటే, క్రమశిక్షణ
కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిస్తే ఇ.వి.యం మాయ
మనపార్టీ గెలిస్తే, దేశాన్ని / రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడం వల్ల
ఇలా వ్రాస్తూపోతే అంతుండదు, ప్రస్తుతానికివి చాలు :-)
~సూర్యుడు
Showing posts with label రాజకీయం. Show all posts
Showing posts with label రాజకీయం. Show all posts
Friday, December 24, 2010
Monday, March 16, 2009
తృతీయ కూటమి, మళ్లీ తప్పు చెయ్యొద్దు!
ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే సాధారణంగా వినిపించేది, కాంగ్రెస్, బిజెపి వ్యతిరేక మూడవ ప్రత్యామ్నాయం. ఇందులో ఎవరెవరుంటారని అడగొద్దు, ఎందుకంటే అందులో ఉన్నవాళ్లకే తెలీదు ఎవరెవరున్నారో, వస్తూంటారు, పోతూంటారు. కాకపోతే ప్రజలు ఈ మూడో ప్రత్యామ్నాయాన్ని చిత్తుకింద ఓడిస్తే కాని మళ్లీ మూడొచ్చి ఇలా ఎన్నికల సమయంలో మళ్లీ మూడో ప్రత్యామ్నాయమని బయలుదేరరు.
ప్రజలకి సేవ చెయ్యడానికి రెండు రాజకీయ పక్షాలు సరిపోవా? రెండు పక్షాలు కాకపోతే రెండు కూటములు, మధ్యలో మూడవదెందుకని? ప్రస్తుతమున్న మూడో కూటమిలో ఎవరెవరున్నరో చూస్తే, బిఎస్‌పి, టిడిపి, ఎఐఎడిఎమ్‌కె, సిపిఐ, సిపిఐ(ఎమ్), టిఆర్‌ఎస్, జనతాదళ్(జత్యాతీత). ఇందులో సిపిఐ, సిపిఐ(ఎమ్) ని మినహాయిస్తే అందరికీ ప్రధానమంత్రి పదవిపైనే కన్ను. ఇందులో ఎవరూ వాళ్ల రాష్ట్రం తప్పితే ఎక్కడా గెలిచే సత్తా లేదు (బిఎస్‌పి ని మినహాయించి). వీళ్లెవరికీ భావ సారూప్యత లేదు, గెలిస్తే ఏంచెయ్యాలో అంతకన్నా తెలీదు (దోచుకోవడం తప్పితే).
దేశాన్ని ఓ దశాబ్దం వెనక్కి తీసుకుపోవడం తప్ప వీళ్లొచ్చి చేసేదేముండదు. చెప్పొచ్చేదేమిటంటే, వేస్తే కాంగ్రెస్ కూటమికి ఓటెయ్యాలి లేకపోతే బిజెపి కూటమికి ఓటెయ్యాలి కాని ఈ మూడోదానికేస్తే రెండిటికి చెడ్డ రేవడి లా తయారవుతుంది దేశం పరిస్థితి.

Subscribe to:
Posts (Atom)