గత మూడు సంవత్సరాలుగా ఈ తెలుగు బ్లాగుల్లో గమనించిందేమంటే, ఇక్కడ రాజకీయాలంటే చాలామందికి ఇష్టం, అంతేకాకుండా, రాజకీయాలంటే ఎంత ఇష్టమో, కాంగ్రెస్ అంటే అంత అయిష్టం. ఇంక వీరి అభిప్రాయాలెలా ఉంటాయంటే:
కాంగ్రెస్ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకొస్తే కుటుంబరాజకీయాలు -
మన పార్టీ నాయకుల పిల్లలొస్తే వంశగర్జనలు
అదే నాయకుడు కాంగ్రెస్‌లో ఉన్నంతవరకు అవినీతిపరుడు, పనికిరానివాడు
మనపార్టీలోకి రాగానే గొప్పరాజకీయనాయకుడు
కాంగ్రెస్‌పార్టీ నాయకులుచేసే అవినీతి స్కాం
మనపార్టీ నాయకులు చేస్తే (ఛ, ఊరుకోండి, మనపార్టీ నాయకులెక్కడైనా అవినీతికి పాల్పడతారా, నిప్పు కదూ ;))
కాంగ్రెస్ నాయకులు వాళ్ల పార్టీ విధానాలకి కట్టుబడుంటే, అకశేరుకాలు
మనపార్టీ నాయకులు మన పార్టీ విధానలకి కట్టుబడుంటే, క్రమశిక్షణ
కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిస్తే ఇ.వి.యం మాయ
మనపార్టీ గెలిస్తే, దేశాన్ని / రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడం వల్ల
ఇలా వ్రాస్తూపోతే అంతుండదు, ప్రస్తుతానికివి చాలు :-)
~సూర్యుడు