Friday, December 24, 2010

బ్లాగుల్లో రాజకీయాలు

గత మూడు సంవత్సరాలుగా ఈ తెలుగు బ్లాగుల్లో గమనించిందేమంటే, ఇక్కడ రాజకీయాలంటే చాలామందికి ఇష్టం, అంతేకాకుండా, రాజకీయాలంటే ఎంత ఇష్టమో, కాంగ్రెస్ అంటే అంత అయిష్టం. ఇంక వీరి అభిప్రాయాలెలా ఉంటాయంటే:

కాంగ్రెస్ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకొస్తే కుటుంబరాజకీయాలు -
మన పార్టీ నాయకుల పిల్లలొస్తే వంశగర్జనలు

అదే నాయకుడు కాంగ్రెస్‌‌లో ఉన్నంతవరకు అవినీతిపరుడు, పనికిరానివాడు
మనపార్టీలోకి రాగానే గొప్పరాజకీయనాయకుడు

కాంగ్రెస్‌పార్టీ నాయకులుచేసే అవినీతి స్కాం
మనపార్టీ నాయకులు చేస్తే (ఛ, ఊరుకోండి, మనపార్టీ నాయకులెక్కడైనా అవినీతికి పాల్పడతారా, నిప్పు కదూ ;))

కాంగ్రెస్ నాయకులు వాళ్ల పార్టీ విధానాలకి కట్టుబడుంటే, అకశేరుకాలు
మనపార్టీ నాయకులు మన పార్టీ విధానలకి కట్టుబడుంటే, క్రమశిక్షణ

కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిస్తే ఇ.వి.యం మాయ
మనపార్టీ గెలిస్తే, దేశాన్ని / రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడం వల్ల

ఇలా వ్రాస్తూపోతే అంతుండదు, ప్రస్తుతానికివి చాలు :-)

~సూర్యుడు

3 comments:

Anonymous said...

అవినీతి, అధికారం దుర్వినియోగం అని విమర్శలు చేసే ప్రతి పక్షాలు .. వారికి అధికారం వచ్చాక చేసేవి అవే. this never changes


ఇంకా ఎక్కడి కాంగ్రెస్ ?

రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకా బ్రతికి వుందంటే కారణం వై.యస్.ఆర్ అనేది నిజం.

Anonymous said...

మీరన్నిది నిజమే. బ్లాగుల్లో దర్శనమిచ్చే పొలిటికల్ పోస్టుల్లో ఇలాంటి కమ్మటి కబుర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ మాత్రం సిగ్గులేకుండా దేశంనాయకులు ఏదంటే దానికి తందానా అంటూ... పైగా మేం నిష్పక్షపాతంగా, కుల, మత, వర్గ, ప్రాంత బేధాలు లేకుండా రాస్తున్నామని సొల్లుకబుర్లు చెబుతారీ శాల్తీలు. వీరికి కాంగ్రెస్ పార్టీలో కనిపించినన్ని తప్పుల్లో పదోశాతం కూడా దేశంలో కనబడవు. పైగా బాబుగారికి పరోక్ష సమర్ధనలు. చదివేవాళ్ళంతా వాళ్ళ అంతరార్ధం తెలుసుకోలేరనుకుంటారో...ఏమిటో(అఫ్ కోర్స్. అది తెలుసుకోలేనివాళ్ళు చాలామందే ఉన్నారని కామెంట్స్ చూస్తే తెలుస్తోంది).

వీటిలో మచ్చుకు కొన్ని

చాకిరేవు
చెప్పుదెబ్బలు
తారకం
sri

Anonymous said...

Edichaaru....
Chaduvukunnavaadevaina congress ni support chesadante nijam ga ascharyapovalsinde....
Desanni dochukunna kukkalu ee kaangeyulu