Sunday, May 6, 2012
Sunday, April 15, 2012
రాజకీయనాయకులతో జోకులా ...
తెలుగు రాజకీయ బ్లాగులు అంత చురుకుగా పనిచెయ్యడంలేదేమో కదా ;) ఎన్నికల సమయంకోసం శక్తి యుక్తుల్ని ఆదా చేస్తున్నారేమో :)
సడెన్‌గా మమతా దీదీ మీద కార్టూన్ల ప్రహసనంతో పాత జోకొకటి గుర్తుకొస్తోంది:
ఎప్పుడో పాతకాలంలో ఒకసారి అమెరికన్ ప్రెసిడెంటు, రష్యన్ ప్రెసిడెంటు మాట్లాడుకుంటున్నారుట, యధాలాపంగా అమెరికన్ ప్రెసిడెంటు అన్నాడుట, నామీద జోకుల్ని సేకరించడం నా హాబీ అని అయితే రష్యన్ ప్రెసిడెంటు నామీద జోకుల్ని వేసేవాళ్లని సేకరించడం నా హాబీ అని అన్నాడట :)
అదీ సంగతి, అనవసరంగా వాళ్ల సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి తెలియకుండా జోకులేస్తే ...
దీదీని ప్రక్కన పెడితే మనవాళ్లు ఓ మాదిరిగా పర్వాలేదనిపిస్తుంది లేకపోతే ఈ పాటికి మన రాజకీయ బ్లాగర్లు బ్లాగులు మూసేసుకోవలసి వచ్చేదేమోకదా?
~సూర్యుడు :-)

Sunday, March 13, 2011
తెలుగు బ్లాగులు
తెలుగు బ్లాగులు ఇన్నాళ్ళుగా చదివిన తర్వాత అర్ధమైనదేంటంటే, ఒకవేళ మన తెలుగు బ్లాగులు సుమారుగా మన తెలుగు జాతి ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నట్లయితే, మనవాళ్ళ గురించి అప్పారావు/గిరీశం గారు ఓ నూట పాతిక సంవత్సరాల ముందే చక్కగా వర్ణించారు. అప్పటికి ఇప్పటికి ఏం మార్పులేదు.
తెలుగు బ్లాగులేం ఖర్మ, తెలుగు టి.వి. కార్యక్రమాలు చూసినా చాలు, మన జాతి ఎలా వెలిగిపోతోందో అర్ధమైపోతుంటుంది. ఇంట్లో తెలుగు టి.వి. కార్యక్రమాలు నిషేధించడమైపోయింది.
ఈ తెలుగు బ్లాగు విశ్వంలో సమయం వెచ్చించడం వృధా అనిపిస్తోంది, అయినా దురలవాట్లు అంత తొందరగా పోవుగా ;)
Friday, December 24, 2010
బ్లాగుల్లో రాజకీయాలు
గత మూడు సంవత్సరాలుగా ఈ తెలుగు బ్లాగుల్లో గమనించిందేమంటే, ఇక్కడ రాజకీయాలంటే చాలామందికి ఇష్టం, అంతేకాకుండా, రాజకీయాలంటే ఎంత ఇష్టమో, కాంగ్రెస్ అంటే అంత అయిష్టం. ఇంక వీరి అభిప్రాయాలెలా ఉంటాయంటే:
కాంగ్రెస్ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకొస్తే కుటుంబరాజకీయాలు -
మన పార్టీ నాయకుల పిల్లలొస్తే వంశగర్జనలు
అదే నాయకుడు కాంగ్రెస్‌లో ఉన్నంతవరకు అవినీతిపరుడు, పనికిరానివాడు
మనపార్టీలోకి రాగానే గొప్పరాజకీయనాయకుడు
కాంగ్రెస్‌పార్టీ నాయకులుచేసే అవినీతి స్కాం
మనపార్టీ నాయకులు చేస్తే (ఛ, ఊరుకోండి, మనపార్టీ నాయకులెక్కడైనా అవినీతికి పాల్పడతారా, నిప్పు కదూ ;))
కాంగ్రెస్ నాయకులు వాళ్ల పార్టీ విధానాలకి కట్టుబడుంటే, అకశేరుకాలు
మనపార్టీ నాయకులు మన పార్టీ విధానలకి కట్టుబడుంటే, క్రమశిక్షణ
కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిస్తే ఇ.వి.యం మాయ
మనపార్టీ గెలిస్తే, దేశాన్ని / రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడం వల్ల
ఇలా వ్రాస్తూపోతే అంతుండదు, ప్రస్తుతానికివి చాలు :-)
~సూర్యుడు

Sunday, October 24, 2010
Saturday, January 2, 2010
Tuesday, May 12, 2009
Subscribe to:
Posts (Atom)