Monday, March 16, 2009

తృతీయ కూటమి, మళ్లీ తప్పు చెయ్యొద్దు!

ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే సాధారణంగా వినిపించేది, కాంగ్రెస్, బిజెపి వ్యతిరేక మూడవ ప్రత్యామ్నాయం. ఇందులో ఎవరెవరుంటారని అడగొద్దు, ఎందుకంటే అందులో ఉన్నవాళ్లకే తెలీదు ఎవరెవరున్నారో, వస్తూంటారు, పోతూంటారు. కాకపోతే ప్రజలు ఈ మూడో ప్రత్యామ్నాయాన్ని చిత్తుకింద ఓడిస్తే కాని మళ్లీ మూడొచ్చి ఇలా ఎన్నికల సమయంలో మళ్లీ మూడో ప్రత్యామ్నాయమని బయలుదేరరు.

ప్రజలకి సేవ చెయ్యడానికి రెండు రాజకీయ పక్షాలు సరిపోవా? రెండు పక్షాలు కాకపోతే రెండు కూటములు, మధ్యలో మూడవదెందుకని? ప్రస్తుతమున్న మూడో కూటమిలో ఎవరెవరున్నరో చూస్తే, బిఎస్‌పి, టిడిపి, ఎ‌ఐఎడిఎమ్‌కె, సిపి‌ఐ, సిపి‌ఐ(ఎమ్), టిఆర్‌ఎస్, జనతాదళ్(జత్యాతీత). ఇందులో సిపి‌ఐ, సిపి‌ఐ(ఎమ్) ని మినహాయిస్తే అందరికీ ప్రధానమంత్రి పదవిపైనే కన్ను. ఇందులో ఎవరూ వాళ్ల రాష్ట్రం తప్పితే ఎక్కడా గెలిచే సత్తా లేదు (బిఎస్‌పి ని మినహాయించి). వీళ్లెవరికీ భావ సారూప్యత లేదు, గెలిస్తే ఏంచెయ్యాలో అంతకన్నా తెలీదు (దోచుకోవడం తప్పితే).

దేశాన్ని ఓ దశాబ్దం వెనక్కి తీసుకుపోవడం తప్ప వీళ్లొచ్చి చేసేదేముండదు. చెప్పొచ్చేదేమిటంటే, వేస్తే కాంగ్రెస్ కూటమికి ఓటెయ్యాలి లేకపోతే బిజెపి కూటమికి ఓటెయ్యాలి కాని ఈ మూడోదానికేస్తే రెండిటికి చెడ్డ రేవడి లా తయారవుతుంది దేశం పరిస్థితి.

2 comments:

భాస్కర రామిరెడ్డి said...

మీరు కామెంట్ల కు ఇంకా అర్హత సంపాయించలేదు :)

Anonymous said...

ఇంకో పెద్ద మనిషి సవివరంగా రాస్తున్న తత్త్వంలో "రెండు సరిపోవు - మూడు ఉంటాయి" అని చెప్పారు. పురుషుడు, స్త్రీ, నపుంసంకము లాగా :); అది నాకు నచ్చింది. అలా మూడో ఫోర్సు ఉండటం తప్పు కాదేమో! కానీ, దీని వల్ల వస్తున్న ఫ్రాక్షనల్ మాండేట్ ఎలా తట్టుకోవడం అనేదేగా మీ భావన!? ఎలక్షన్స్ ఐపోయేకే రివ్యూ చేస్తే బావుంటుందేమో అని ఆలోచిస్తున్నా :)